రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

విశ్వంభర, సిద్దిపేట: రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని నంగునూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సాదుల పవన్ కుమార్ అన్నారు. మండలంలోని వెంకటాపూర్, ముండ్రాయి, కోనాయిపల్లి, తిమ్మాయిపల్లి, ఖానాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఏఎంసీ డైరెక్టర్‌లతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. క్వింటాల్‌కు రూ.2,389 మద్దతు ధర పొందాలని కోరారు. కొనుగోలు ప్రక్రియ వేగంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏఓ గీత, మాజీ జడ్పీటీసీ దువ్వల మల్లయ్య, ఏఎంసీ డైరెక్టర్లు ఇమ్రాన్, కొమ్మరాజుల ఐలయ్య, పిడిశెట్టి ప్రభాకర్, గొట్టం రంగారెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ మైపాల్ రెడ్డి, గణపురం రమేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags: