జనాభా గణాంకాలు వాస్తవ విరుద్ధం
: జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్
విశ్వంభర, బషీర్ బాగ్ : ప్రభుత్వం ప్రకటించిన వడ్డెరల జనాభా గణాంకాలు వాస్తవానికి విరుద్ధమని జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధర్ అన్నారు. తమ జనాభాపై ఖచ్చితమైన సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్ తో కలసి అయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన 5,43,571 మంది, అంటే 1.8 శాతం జనాభా గణాంకం పూర్తిగా తప్పుదారి పట్టించేదని తీవ్రంగా విమర్శించారు. వాస్తవానికి వడ్డెరల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందన్నారు. వడ్డెర సమాజానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సాధించడమే లక్ష్యంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సరైన జనగణన లేక, తగిన రిజర్వేషన్లు అందక, ఉపాధి అవకాశాలు లేక, విద్యలో వెనుకబాటు అంశాలు అభివృద్ధికి పెద్ద అడ్డంకులుగా మారాయని పేర్కొన్నారు. వడ్డెరలు విద్య, ఉపాధి రంగాల్లో వెనుకబడటానికి ప్రధాన కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యమే అన్నారు. వడ్డెరల హక్కుల సాధన కోసం మూడు దశల్లో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బోదాస్ రవి, వేముల భరత్, మల్లె కృష్ణ, పల్లపు రమేష్, పీట్ల శివకుమార్, జరుపటి రాజు, జెరుపటి మధు, దండు గుల లక్ష్మీనారాయణ, కొడగంటి కృష్ణ, జెరుపటి మధు, కుమార్ పాల్గొన్నారు.



