చిన్ననాగారంలో విద్యుదాఘాతంతో ఆవు మృతి
On
విశ్వంభర, ఇనుగుర్తి: విద్యుత్ ఆఘాతంతో ఆవు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో చోటుచేసుకుంది. బాధిత రైతు మూరగుండ్ల వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం, తాను పెంచుకుంటున్న ఆవు యధావిధిగా సోమవారం మేతకు వెళ్లిన క్రమంలో సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో తన రూ.70 వేల విలువ గల ఆవు మృతి చెందడంతో వెంకన్నతోపాటు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మరో ఆవును పెంచుకునేందుకు వీలుగా తమకు ఆర్థిక సహాయం అందించాలని వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు.



