స్పెషల్ ఎడ్యుకేషన్ వికలాంగుల హక్కు

స్పెషల్ ఎడ్యుకేషన్ వికలాంగుల హక్కు

విశ్వంభర, నల్లకుంట : వికలాంగులకు స్పెషల్ ఎడ్యుకేషన్ అందించడం వారి హక్కు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి అని డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ది డేఫ్ జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో-కన్వీనర్ కాటమోని వెంకటేష్ అన్నారు. హెలెన్ కెల్లర్ 146వ జయంతి సందర్భంగా హైదరాబాదు నల్లకుంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. హెలెన్ కెల్లర్ జీవితం వికలాంగుల హక్కుల సాధనకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినికిడి, దృష్టిలోపాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వినికిడి, దృష్టిలోపం ఉన్న వారికి ప్రత్యేక విద్య, వైద్య సేవలు, పునరావాస సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో స్పెషల్ టీచర్ల నియామకాన్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ సంకేత భాష అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. వికలాంగుల సంక్షేమం, సాధికారత, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, హక్కుల సాధన కోసం ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/special-education-is-the-right-of-the-disabled/article-17324

Tags: