పిల్లోనిగూడ గ్రామంలో విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు
విశ్వంభర, శంషాబాద్: పిల్లోనిగూడ గ్రామం నుండి పాలమకుల మోడల్ స్కూల్ విద్యార్థుల కోసం ఈరోజు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ బస్సు ఉదయం 8:30 గంటలకు విద్యార్థులను స్కూల్‌కు తీసుకెళ్తూ, సాయంత్రం 4:30 గంటలకు తిరిగి గ్రామానికి తీసుకువస్తుంది. రోజుకు రెండు ట్రిప్పులు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పానుగంటి స్వర్ణలత నరసింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిల్లి శ్రీశైలం ముదిరాజ్, మాజీ సర్పంచ్ కర్రే బుచ్చమ్మ, వార్డు సభ్యులు మహేష్ ముదిరాజ్, కృష్ణ, గణేష్, అలాగే గ్రామ నాయకులు జుర్కి రమేష్ పటేల్, పి. సుధాకర్, స్కూల్ పిల్లలు కూడ ఉత్సాహంగా పాల్గొన్నారు.