నాగలి పట్టి  విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

విశ్వంభర, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని కూరెళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రైతులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ దుక్కి దున్ని విత్తనాలు చల్లారు . ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ లో సమృద్ధి వర్షాలు పడి రైతులతో పాడి పంటలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భూమాత ను ప్రార్థిస్తూ కూరెళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక పేర్కొన్నారు.రైతు కొత్త వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ, భూమాతకు, ప్రకృతికి నమస్కరించి మంచి పంటలు పండాలని కోరుకునే పవిత్రమైన రోజు ఏరువాక పౌర్ణమి అన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు చెప్పారు. ఆ అన్నాన్ని పండించే రైతే ఈ దేశానికి వెన్నెముక అని అన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం సాగునీటి వసతుల మెరుగుదల, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలి సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలన్నారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రకృతి అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు  ఈ పవిత్రమైన రోజున భూమాత ఆశీర్వాదంతో ప్రతి రైతు కుటుంబం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ  అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలు పండాలి ఆర్థికంగా మంచి రాబడి రావాలన్నారు.ఈ సీజన్ లో అన్ని పంటలు క్రిమి కీటకాలు లేకుండా ఆర్ధికంగా మంచి రాబడి వచ్చేలా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.రైతు దేశానికి రైతు వెన్నముఖ అన్నారు. రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ponnam-prabhakar-the-minister-who-took-the-plow-and-sowed/article-17387

Tags: