సునైనా  ఆస్పత్రి ప్రారంభోత్సవం 

సునైనా  ఆస్పత్రి ప్రారంభోత్సవం 

విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో  తొర్రూర్ బస్టాండ్ వద్ద  సునైన కంటి ఆస్పత్రిని మహబూబాబాద్ శాసనసభ్యులు , పార్లమెంటు సభ్యులు డాక్టర్ భూ ఖ్య మురళి నాయక్ , పోరిక బలరాం నాయకులు ముఖ్యఅతిథిగా  హాజరై  ఆసుపత్రిని ప్రారంభించారు . ఈ సందర్భంగా  ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ సురేష్ ,డాక్టర్ కవితలను, ఉద్దేశించి ఎమ్మెల్యే ,ఎంపీ లు  మాట్లాడుతూ,   ఇప్పుడు ఎవరికైనా కంటి సమస్యలు వస్తే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని వీటికి సంబంధించిన నాణ్యమైన పరికరాలు సునయన ఆసుపత్రిలోనే ఉన్నాయని ఆస్పత్రి యాజమాన్యం కూడా చాలా సీనియర్,  ప్రముఖ వైద్యులు అని, ఈ ఆస్పత్రి జిల్లా ప్రజలకు ఒక కాను కానీ చెప్పవచ్చు అని ఎమ్మెల్యే  జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంకా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ ఈ ఆసుపత్రి మహబూబాబాద్ లో స్థాపించడం అదృష్టంగా భావిస్తున్నామని, ఎంపీ అన్నారు .  ఆస్పత్రి యజమాన్యం మాట్లాడుతూ,  మా సేవలు అందరికీ ఎల్లప్పుడూ ఉంటాయని,  సేవలను అందరూ సద్వినం చేసుకోవాలని అన్నారు .

Tags: