సమాజ అభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర
On
విశ్వంభర, సూర్యాపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ మహిళలను ఘనంగా సన్మానించారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. కుటుంబం నుండి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. మహిళల గౌరవం కాపాడే సమాజమే అభివృద్ధి చెందుతుందని వట్టే జానయ్య యాదవ్ అన్నారు. మహిళల శక్తి, ధైర్యం, సేవా భావం సమాజానికి ఆదర్శమని కొనియాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TRP మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షురాలు కొన్నే మంజుల గౌడ్,ఉపాధ్యక్షురాలు వర్రె కవిత, ప్రధాన కార్యదర్శి నారాయణ దాసు కవిత,దీప మాల, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.



