టీజీవో భవన్ లో ఘనంగా మహిళా దినోత్సవం
విశ్వంభర, ఖమ్మం : తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు టీజీవో భవన్ నందు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు, టీజీఈజెఎసి సెక్రటరీ జనరల్, స్థానిక కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ కార్యక్రమానికి పి సుధారాణి టిజిఓ మహిళా కార్యదర్శి అధ్యక్షత వహించి, కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ప్రకటించిన హక్కులు, న్యాయం, కార్యాచరణ, అందరు మహిళలు, బాలికల కోసం అనే థీమ్‌తో పాటు, అంతర్జాతీయంగా “గివ్ టు గెయిన్” అనే ప్రచారంతో మహిళా సాధికారతకు కొత్త అర్థాన్ని ఇవ్వాలన్నారు. ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేవలం వేడుకలు జరుపుకోవడమే కాకుండా, మహిళలకు సమాన వేతనం, విద్య మరియు రక్షణ కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని, మహిళలు ఆర్థికంగా స్థిరపడినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని వివరించారు. స్థానిక కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల మాట్లాడుతూ, నేటి మహిళా దినోత్సవం కేవలం ఒక రోజు కార్యక్రమం కాకుండా, ప్రతి మహిళా తన హక్కుల కోసం, న్యాయం కోసం నిరంతరం పోరాడే స్ఫూర్తినిచ్చే రోజు మహిళా దినోత్సవం అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు, కార్యదర్శి మోదుగు వేలాద్రి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపల్లి శేషు ప్రసాద్, హౌస్ బిల్లింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి. విజయ్ కుమార్, కోశాధికారి సూరంపల్లి రాంబాబు, టీజీవో మహిళ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్. విజయ కుమారి, ప్రిన్సిపల్స్ అసోసియేషన్ నవీన జ్యోతి, మహిళ గెజిటెడ్ అధికారులు డాక్టర్ పి. అనిత, డాక్టర్ డి. సుజాత, లెక్చరర్ సంఘం అధ్యక్షురాలు ప్రమీల, చంద్రకళ, రాధా, లలిత, అగ్రికల్చర్ ఆఫీసర్స్ అరుణకుమారి, అరుణ జ్యోతి, తార, ట్రెజరీ గెజిటెడ్ అధికారులు మంజుల, శారద, లావణ్య, రమ, నిర్మల, సాజిద, కవిత, వి. రమ, లలిత, విజయలక్ష్మి, షహీన్, నాగమణి, శిరీష, నాలుగో తరగతి జిల్లా అధ్యక్షులు బిక్కు నాయక్, డ్రైవర్ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పి. పుల్లయ్య, మున్సిపల్ సంఘ అధ్యక్షులు సుధాకర్, భాస్కర్ మోదుగు వెంకటేశ్వర్లు, మల్లయ్య, కృష్ణార్జునరావ్ తదితరులు పాల్గొన్నారు.



