మహేశ్వరంలో ఘనంగా మహిళా దినోత్సవం
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ ఆధ్వర్యములో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని , మహిళా లను ఘనంగా సన్మానించి, మహిళలందరితో కలిసి కేక్ కట్ చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమములో సర్పంచ్ మునగపాటి నవీన్ మాట్లాడుతూ, మహిళలు లేనిదే సృష్టి లేదు ప్రతి మహిళ తన కుటుంబం కోసం అహర్నిశలు కృషి చేస్తూ తన తమ జీవితాలను తమయొక్క కుటుంబం కోసం పాటుపడుతుంది. అందుకే మహిళలును అందరం,గౌరవించి కాపాడుకోవాలని తెలిపినారు. అదేవిధముగా ప్రభుత్వం మహిళల యొక్క ఆరోగ్యం నిమిత్తం గర్భాశయ క్యాన్సర్ ను రూపుమాపుటకు హెచ్ పి వి వ్యాక్సిన్ ను 14, 15సంవత్సరాల బాలికలందరికి ఉచితముగా ప్రభుత్వం అందిస్తున్నందున యువతులందరూ ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు, ఈ కార్యక్రమములో ఉపసర్పంచ్ జోరల రమేష్,వార్డు సభ్యులు టింగ్లికర్ బేబీ ,పొల్కంసునీత,అవులకడి కిష్టమ్మ , స్వర్ణగంటి సంజీవ ,షేక్ అజమ్ , కాడమోని స్వాతి,వత్తుల శాలిని,కాకి పరమేష్,దిద్దెల శ్రీశైలం,ఆకులవీరబాబు,సున్నం స్వప్న , జటావత్ రుకేష్, రెవెల్లె చంద్రమౌళి, నాయకులు కర్రోళ్ళ చంద్రయ్య,మాజీ పి ఎ సి ఎస్ డైరెక్టర్కడమోని ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి సుజాత, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.



