నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్వోత్తమ్ రెడ్డి
On
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారామ కన్వెన్షన్ హాల్ లో భాగ్యశ్రీ ఎలక్ట్రికల్స్ అధినేత పిట్టల వెంకటేశ్వర్లు కుమార్తె వివాహ మహోత్సవము ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది లు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యండి అంజద్ అలి, సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, సేవాదల్ ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దెబోయిన శ్రీనివాస్, దంతాల సాయి నవీన్, అన్నమయ్య రాము, చెరుకు రాము, గుణగంటి సైదులు తదితరులు పాల్గొన్నారు.



