మహిళల ఆరోగ్యం కోసం హెచ్ పి వి వ్యాక్సిన్
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ నందు భారత ప్రభుత్వం మహిళల ఆరోగ్యం వారి సంక్షేమం కోసం గర్భాశయ క్యాన్సర్ నివారించడానికి ఉచిత హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ ప్రారంభించరు, ఈ కార్యక్రమములో సర్పంచ్ మునగపాటి నవీన్, మాట్లాడుతూ భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇట్టి కార్యక్రమం మహిళలకు ఆరోగ్య విషయములో గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఒక వరం లాంటిదని , అందువలన గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు బాలికలు అందరు హెచ్ పి వి టీకా తీసుకోవాల్సిందిగా కోరారు, ఈ వ్యాక్సిన్ ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు అంగన్‌వాడీ కేంద్రాల పి హెచ్ ఎస్ సి సెంటర్ యందు ఈ కార్యక్రమం 3 నెలల పాటు కొనసాగుతుందని తెలిపినారు, ఈ కార్యక్రమములో ఉపసర్పంచ్ జోరల రమేష్, వార్డు సభ్యులు టింగ్లికర్ బేబీ , పొల్కంసునీత,అవులకడి కిష్టమ్మ , స్వర్ణగంటి సంజీవ,కదామోని స్వాతి , వత్తుల శాలిని , కాకీ పరమేష్, దిద్దెలశ్రీశైలం,ఆకులవీరిబాబు,సున్నం స్వప్న , జటావత్ రుకేష్ రెవెల్లె చంద్రమౌళి, ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్, సిహెచ్ ఇంచార్జ్ సిద్ధిక్ ,పీహెచ్ మెడికల్ ఆఫీసర్స్,పీహెచ్ స్టాఫ్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



