నెల్లికుదురులో ఘనంగా మహిళా దినోత్సవం
On
విశ్వంభర, నెల్లికుదురు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రం నెల్లికుదురుకు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు హెచ్చు అలివేలు మహిళా వార్డు సభ్యులను,అంగన్వాడీ టీచర్లు,ఆయాలు,డ్వాక్రా సంఘాల లీడర్లను,ఆశా కార్యకర్తలను ఆదివారం స్థానిక గ్రామపంచాయతీ వద్ద శాలువాలతో ఘనంగా సన్మానించి గౌరవించారు.ఈ సందర్భంగా అలివేలు మాట్లాడుతూ మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని,మహిళా నాయకురాలిగా తోటి మహిళలను మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించడం తనకు సంతృప్తినిచ్చిందన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచి పులి వెంకన్న, ఎంపీడీవో కుమార్, ఉప సర్పంచ్ మంచాల వెంకన్న, పంచాయతీ కార్యదర్శి వేద రాజేశ్వర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



