అంగన్వాడి సెంటర్లను సందర్శించిన సర్పంచి
On
విశ్వంభర,ఇనుగుర్తి: మండలంలోని కోమటిపల్లి సర్పంచి మద్దెల బిక్షపతి గౌడ్ గ్రామంలోని రెండు అంగన్వాడీ సెంటర్లను సందర్శించారు.బాలామృతం,గుడ్లు తదితర ఫీడింగును పిల్లలు, తల్లులు, కిశోర బాలికలు, బాలింతలకు,గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పౌష్టికాహారాన్ని సకాలంలో లబ్ధిదారులకు అందించి సద్వినియోగం అయ్యేలా చూడాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు.అనంతరం తాను అధ్యక్షులుగా కమిటీలను ప్రకటించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు యాకూబి, అంగన్వాడీ టీచర్లు చిరగోని కవిత,అడప జ్యోతి ఆయాలు తదితరులు పాల్గొన్నారు.



