మహనీయుల విగ్రహాలను తొలగించ వద్దు
- బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్
విశ్వంభర, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ అధికంగా ఉందని రోడ్డు విస్తరణలో భాగంగా సాగర్ రోడ్డులో గల మహనీయుల విగ్రహాలను తొలగించవద్దని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ సోమవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి, అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ రోడ్ల విస్తరణ ఇతర కారణాలతో మహనీయుల విగ్రహాలను తొలగించడం అంటే వారి యొక్క ఆశయాలను మనం సమాధి చేయడమే అవుతుందన్నారు. తప్పనిసరైతే మహనీయులు,చారిత్రక నేపథ్యం ఉన్న విగ్రహాలను ఉంచి రాజకీయ నాయకుల విగ్రహాలను తొలగించండి అని లింగంగౌడ్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, దోనేటి శేఖర్ నక్క నాగరాజు మహేష్ వంశీ బొమ్మ కంటి హరి శ్రీనివాస్ యాదవ్ రాంబాబు అంజి యాదవ్ సతీష్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.



