ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి 

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి 

  విశ్వంభర, బోడుప్పల్:  బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు డాక్టర్ రాపోలు రాములు కార్యాలయం వద్డ ఘనంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు హాజరై బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ,  బాబు జగ్జీవన్ రామ్  ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినా ప్రజా సేవకై అనునిత్యం పాటుపదిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. తన చిన్నతనం నుంచే తనకు ఎదురైనా అంటారని తనం, కులవివక్ష, సామాజిక అసమానతలపై తన గళాన్ని వినిపిస్తూ సమానత్వాన్నికై పోరాడారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటాలు చేశారు. అనగారిన వర్గాల సమానత్వాన్ని ప్రోత్సహించి వారికి న్యాయం జరిగే దిశగా ముందుకు సాగరు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగినా అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు పార్లమెంటు సభ్యుడుగా పనిచేశారు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగా ఆయన రికార్డ్ సృష్టించారు. ఐదు దశాబ్దాలకు పైగా చట్టసభ సభ్యుడుగా పనిచేసి ప్రపంచ రికార్డు సాధించిన ఘనత జగ్జీవన్ రావుకు ఉందన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సామాజిక పనులు ఎన్నో ఉన్నాయని ఆయన ఒక అద్భుతం అని రాపోలు రాముడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహం లింకన్, శ్రీనివాస్ గుప్తా, మహేష్, ఫెడరేషన్  సలహాదారులు,సభ్యులు,తదితరులు పాల్గొని  బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించారు.

Tags: