డిగ్రీ కాలేజీలో పేపర్ క్రాఫ్ట్స్ పై వర్క్ షాప్
విశ్వంభర, మహబూబాబాద్: జిల్లా కేంద్రం లోని నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా.బి.లక్ష్మణ్ అధ్యక్షతన పేపర్ క్రాఫ్ట్స్ పై వర్క్ షాప్ నిర్వహించారు. ఎకో క్లబ్ కోఆర్డినేటర్ జూపూడి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం పేపర్ క్రాఫ్ట్స్ అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు . ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, పేపర్లను ఉపయోగించి, నిత్యా వసరాలలో భాగంగా ప్రతిరోజు ఉపయోగించే కొన్ని రకాల పర్యావరణ హిత వస్తువులను ఎలా తయారు చేయాలో ప్రయోగాత్మకంగా చేసి విద్యార్థులకు చూపించారు . పర్యావరణానికి మేలు కలిగించే విధంగా వివిధ రకాల వస్తు ఉత్పత్తులను తయారుచేసి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి పై ఉందని స్టూడెంట్స్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.సిహెచ్ శ్రీనివాసులు, అధ్యాపకులు బి శ్రీనివాస్,డా.వి సాంబశివరావు,ఏ అన్నపూర్ణ, డా.బి హాతిరామ్,డా.కాశీంషా ఎం సుమన్, యం వీరు,డా.కే సుమలత, డా.పి ఉపేందర్, జే.యాకయ్య తదితరులు పాల్గొన్నారు .



