మీసేవ ఛార్జీల పెంపుతో పేదలపై భారం

మీసేవ ఛార్జీల పెంపుతో పేదలపై భారం

విశ్వంభర, సిద్దిపేట: మీసేవ ఛార్జీలు పెంచడం ద్వారా ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకునే వారిపై అదనపు భారం పడుతుందని సిద్దిపేట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పాల సాయిరాం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోలా రమేష్ గౌడ్, మోహిజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. ఇప్పటివరకు నామమాత్రంగా ఉన్న మీసేవ ఛార్జీలను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచడం ద్వారా పేదలపై అధిక భారం పడుతుందన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుకు మాత్రమే ఉందని, చేతల్లో మాత్రం దగా పాలన, దోపిడీ ప్రణాళిక అన్నట్టుగా పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం, ఛార్జీలు మాత్రం పెంచుకుంటూ పోతుందని ఎద్దేవా చేశారు. పెంచిన మీసేవ ఛార్జీలను తగ్గించాలని, మీసేవ ఆపరేటర్లకు ఫిక్స్డ్ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ సయ్యద్, బీఆర్ఎస్ నాయకులు పిండి అరవింద్, బెదురు తిరుపతి, నిమ్మ రజనీకాంత్ రెడ్డి, సాయిప్రేమ్, నాగరాజు, అహ్మద్ పలువురు పాల్గొన్నారు.

Tags: