.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 

.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 

విజయవంతంగా హ్యాపీ సండే కార్యక్రమం

విశ్వంభర,  చండూరు :- మున్సిపల్ కార్యాలయము  ఆదివారం నాడు బాబు జగ్జీవన్ రామ్  జయంతి సందర్భంగా మున్సిపల్ పాలకవర్గము మరియు కమిషనర్ గార్లు  ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా  “హ్యాపీ సండే” కార్యక్రమములో భాగంగా ఉదయం: 9:00 గంటలకు గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్కూల్ విద్యార్దులతో యోగా కార్యక్రమము నిర్వహించడం జరిగింది. తదుపరి 3వ వార్డులో డిగ్రీ కాలేజీ ప్రక్కన గంజి  భ్రమరాంభ గారి ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమములో  పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో  మునిసిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ యోగ చేయడం మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి రోజూ యోగ చేయడం అలవాటు చేసుకోవాలని పాఠశాల విద్యార్థులకు చెప్పారు. మరియు తెలంగాణా ప్రజా ప్రభుత్వo ప్రతిష్టాత్మకoగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పధకం వలన నిరుపేదలకు సొంత ఇంటికల నెరవేరిందని, పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరిందని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరమని అన్నారు.  

మున్సిపల్  కమీషనర్ ఎల్. మల్లేశం మాట్లాడుతూ యోగ చేయడంవలన మనసు ఏకాగ్రత మరియు చదువు పైన ద్రుష్టి సాదిస్తారని పాఠశాల విద్యార్థులకు చెప్పడం జరిగింది మరియు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి తెలంగాణా ప్రభుత్వo అందిస్తున్న ఆర్ధిక సహాయం పేద ప్రజలకు చాల ఉపయోగ పడుతుందని అన్నారు.
          ఇంకా ఈ  కార్యక్రమములలో  వైస్ చైర్ పర్సన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు శ్రీమతి తెలుకుంట్ల రాజకుమారి, బుషిపాక వాసు, సామ సుజాత, జెల్ల ధనమ్మ, కోన్రెడ్డి మధు, కోడి సుష్మవెంకన్న, కటకం రమేష్,  అయుష్ యోగ ఇన్స్పెక్టర్ ఇడికూడా వెంకటేష్,వార్డు ఆఫీసర్స్ శ్రీరాములు,సాయి రామ్,ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ M.అరవింద్ రెడ్డి, బిల్ కల్లెక్టర్స్ మహేష్,రమేష్,మంజుల,మెప్మ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది..

Read More జోరుగా  కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం

Tags:  

Advertisement

LatestNews

.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 
చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు