మహేశ్వరంలో ప్రగతి ప్రణాళిక గ్రామసభ సమావేశం  

మహేశ్వరంలో ప్రగతి ప్రణాళిక గ్రామసభ సమావేశం  

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం   గ్రామ పంచాయతీ కార్యాలయము  మహేశ్వరం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతీష్టాత్మకముగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగముగా  గ్రామ సర్పంచ్  మునగపాటి నవీన్  ఆధ్వర్యంలో  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ సమావేశము నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభ నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగముగా గ్రామ పంచాయతీ మహేశ్వరంలోని లబ్దిదారులకు వచ్చే ప్రభుత్వ పథకాలకు సంభందించి, ఉచిత బస్సు, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులకు, రైతు భరోసా, రైతు భీమా, సన్నరకం వడ్లకు బోనస్ వంటి వివిధ పథకాల గురించి గ్రామ ప్రజలకు తెలియపరుచనైనది  ఇట్టి సమావేశములో లబ్దిదారులు ఇచ్చిన పిర్యాదులను స్వీకరించడము జరిగినది. అనంతరము గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్  మాట్లాడుతూ గ్రామ సభ యందు వచ్చిన ధరఖాస్తులను ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లి పరిష్కారము అయ్యే విధముగా చర్యలు తీసుకుంటామని తెలుపుతూ ,గ్రామములొ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా మౌలిఖ వసతులు కల్పనకు కృషి చేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమానికి   ముఖ్య అతిథి గా మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మెన్  సభావత్ కృష్ణ నాయక్ హాజరై ఆయన మాట్లాడుతూ   ప్రభుత్వము ద్వారా వచ్చే పథకాల గురించి వివరించినారు,అధెవిధముగా మహేశ్వరం గ్రామంలో  గుర్రం సావిత్రి  యొక్క ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమములో పాల్గొనడము జరిగింది. ఈ కార్యక్రమము లో ఉప సర్పంచ్  జొరల రమేశ్, వార్డు సభ్యులు తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, శివగంగ ఆలయ కమిటీ ఛైర్మన్  అల్లే కుమార్ ,ఇందిరమ్మ కమిటీ సభ్యులు కర్రోల్ల రాములు , స్వర్ణగంటి సుబాష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు  కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకి ఈశ్వర్ ముదిరాజ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి ,బంగరి గల్ల లాజర్, వత్తుల రఘుపతి ,వివిధ శాఖల అధికారులు, పంచాయతి కార్యదర్శి సుజాత ,గ్రామ పంచాయతి సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొనడం  జరిగింది.

Tags: