హనుమంతుని ఆశీస్సులు ఉండాలి 

హనుమంతుని ఆశీస్సులు ఉండాలి 

  • మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత

 విశ్వంభర, సూర్యాపేట: హనుమంతుని ఆశీస్సులు ప్రజలందరిపై వుండాలని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు.  గురువారం సాయంత్రం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద గల అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ విజయోత్సవ శోభాయాత్రలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో ప్రజలు ప్రతి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారని అన్నారు. శ్రీరాముని, హనుమంతుని భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో హనుమాన్ విజయోత్సవ దినోత్సవం వెలుగులు నింపాలని, శ్రీరాముని, హనుమంతున్ని  ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గండూరి రమేష్,  అభయాంజనేయ స్వామి ఆలయం కమిటీ చైర్మన్ కొత్త ఆంజనేయులు,  ఆలయ అర్చకులు దరూరి రామానుజాచార్యులు, దరూరి శ్రీదరాచార్యులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు కారింగుల ఉపేందర్,పర్వతం శ్రీధర్, బైరు విజయ కృష్ణ, సంకరమద్ది మధుసూదన్, పున్నం సందీప్, బిజెపి నాయకులు రంగరాజు రుక్మారావు,  చల్లమల్ల నరసింహ, పాండురంగా చారి, ఎల్గూరి రామ్మూర్తి,   కలకోట లక్ష్మయ్య, వెంపటి శబరినాథ్, యామా సంతోష్, శ్రీరంగం రాము, పెద్దసంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 
చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు