మద్యపానంపై కట్టడి, టవర్ ఏర్పాటుకు హామీ

మద్యపానంపై కట్టడి, టవర్ ఏర్పాటుకు హామీ

  • :  వస్తాకొండూరు గ్రామసభ

విశ్వంభర,  గుండాల : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరు గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభను  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ లింగాల అనిల్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఉప సర్పంచ్ శెట్టిపల్లి పరశురాములు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఎస్.కె. ఇస్మాయిల్ సమక్షంలో సమావేశం జరిగింది. ఈ గ్రామసభలో గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పలు సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా గ్రామంలో మద్యపానం నిషేధించాలని, బెల్ట్ షాపులను మూసివేయాలని కోరారు. అలాగే గ్రామంలో ఫోన్ సిగ్నల్ సమస్య తీవ్రంగా ఉందని, సెల్ టవర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సర్పంచ్ లింగాల అనిల్ కుమార్ గౌడ్, బెల్ట్ షాపుల నిర్వహణదారులకు ఇప్పటికే ఉన్న స్టాక్‌ను 15 రోజుల్లో ముగించుకొని, ఆ తర్వాత అమ్మకాలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. అలాగే గ్రామంలో మొబైల్ టవర్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీశైలం, ఉభయ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఏఎన్‌ఎమ్ ఉపేంద్ర, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ రమణ ,వీఏఓ సునీత, వీరమల్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు. యువకులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: