చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*

చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*

విశ్వంభర, షాద్నగర్: షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మ గుడి వద్ద ఈ రోజు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కే. శ్రీనివాస చారి ప్రారంభించారు.వేసవి కాలంలో ప్రయాణికులు, స్థానిక ప్రజలు తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ సేవే లక్ష్యంగా బీజేపీ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు...- ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం. - ఘనంగా బాబు జగ్జీవన్ రామ్  జయంతి 
చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు సేవే లక్ష్యంగా బీజేపీ నాయకులు*
సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు