సర్దార్ పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం
విశ్వంభర, చేవెళ్ల: బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని భారతీయ జనతా పార్టీ యువ నాయకులు డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సర్దార్ పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా చేవెళ్లలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైభవ్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలోని వెనుకబడిన వర్గాల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షులు అత్తిలి అనంతరెడ్డి, శంకర్ గౌడ్, చాకలీ శ్రీను, మధుకర్, గణేష్, అశోక్, జయసింహ, నాగరాజు, జంగయ్య తదితరులు పాల్గొని సర్దార్ పాపన్న గౌడ్‌కు ఘన నివాళులర్పించారు.



