ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామసభలు

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామసభలు

విశ్వంభర, నెల్లికుదురు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలు మండలంలోని వివిధ గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ కొత్తపల్లిలో సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ అధ్యక్షతన జరిగిన సభకు తహసిల్దార్ నరేష్ హాజరయ్యారు.బడి తండాలో బిలావత్ ధనమ్మ అమృ,సౌల్ల తండా గుగులోతు సుజాత వాసు,మునిగేలవీడు బొల్లికొండ చైతన్య నాగరాజు,కాస్య తండా బోడ నరసింహ నాయక్,శ్రీరామగిరి మాదరి ప్రశాంత్, నెల్లికుదురు పులి వెంకన్న, నైనాల యాసం సంధ్యా రమేష్, పార్వతమ్మ గూడెం ఎదల్ల పూలమ్మ, రామన్నగూడెం బండి నరసయ్య,ఆలేరు నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి ల అధ్యక్షతన ఆయా గ్రామాల లో ఆయా సర్పంచి ల అధ్యక్షతన గ్రామసభలు జరిగాయి.ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు చెప్పారు. వినతులను సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో స్వీకరించారు.సంక్షేమ పథకాల అమలు, గ్రామ అభివృద్ధి పనులు,ప్రజా సేవల మెరుగుదలపై చర్చించారు. కాగా హనుమాన్ నగర్ తండా లో సర్పంచి గుగులోతు అశోక్ అధ్యక్షతన జరిగిన సభలో గత రెండు సంవత్సరాలుగా ఆదాయ వ్యయాలు చూపడం లేదని గ్రామస్తులు సభ దృష్టికి తీసుకువచ్చారు.

Tags: