ప్రతీ పథకం అర్హులకు అందజేస్తాం

ప్రతీ పథకం అర్హులకు అందజేస్తాం


  • : సర్పంచి రేణుక నరేష్

విశ్వంభర, ఇనుగుర్తి: ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని అర్హులకు అందించి తీరుతామని మండలంలోని పెద్దతండ(సీఎం)సర్పంచి బానోతు రేణుక నరేష్ గ్రామసభలో ప్రకటించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక గ్రామ సభ సర్పంచి రేణుక నరేష్ అధ్యక్షతన గురువారం జరగగా ఎంపీడీవో పార్థసారధి హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రాజేష్ తో పాటు ఆయా శాఖల అధికారులు వివిధ పథకాల గురించి గ్రామసభలో చదివి వినిపించారు. ప్రజలు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వినతులను అధికారులు స్వీకరించారు.ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామసభ బలమైన వేదిక అన్నారు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ దీప్ల, ఏఈవో ముజాహిద్,ఉపసర్పంచి బాదావత్ శిరీష, లైన్మెన్ లక్పతి,ఫీల్డ్ అసిస్టెంట్ వెంకన్న వార్డు సభ్యులు,అంగన్వాడీ టీచర్లు,ఆశా వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: