27న శ్రీరామనవమి శోభాయాత్ర
On
విశ్వంభర, కాచిగూడ : శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 27న అంబర్ పేట పేటలో సీతారాముల శోభాయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంబర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు శోభాయాత్ర కొనసాగనున్నట్లు, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నిర్వాహకులు కాచిగూడ, రహ్మత్‌బాగ్, చెవులబజార్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి గౌతంరావు, మాజీ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్, నరేందర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.



