కుత్బుల్లాపూర్ లో  హనుమాన్ జయంతి ఉత్సవాలు 

కుత్బుల్లాపూర్ లో  హనుమాన్ జయంతి ఉత్సవాలు 

విశ్వంభర, కుత్బుల్లాపూర్:   హనుమాన్ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి  పలు ఆలయాలను సందర్శించారు.  స్వామివారిని దర్శించుకొని, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం హనుమాన్ జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖలు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణి కార్యక్రమంలో కూడా పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags: