గ్రామాభివృద్దే లక్ష్యం : సర్పంచ్ లక్ష్మమ్మ
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా కల్వకోల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం గ్రామ అభివృద్ధిపై చర్చించడం జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రతి సమస్యను సర్పంచ్ క్షుణ్ణంగా నోట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మన ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది విధంగా చేస్తానని గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, చర్చకు వచ్చిన సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో అతి తొందరలోనే పరిష్కరిస్తాం అని త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి అభివృద్ధి పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటాం అని సర్పంచ్ తెలియజేయడం జరిగింది. అధే విధంగా గ్రామం లో గట్టుపల్లి జంగయ్య ఇందిరమ్మ ఇంటిని సర్పంచ్ చేతుల మీదగా గృహ ప్రవేశం చేసి రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఈ సమవేశంలో గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ జనార్దన్ గౌడ్, వార్డ్ సభ్యులు, గ్రామ పరిధిలో ఉన్న పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఎస్ హెచ్ జి , సీసీ ఓబీలు, అంగన్వాడి, ఆశ తదితర, గ్రామ పెద్దలు, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.



