ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
విశ్వంభర, వరంగల్ :- హసన్ పర్తి మండలం లోని ఎర్రగట్టు గుట్ట షైన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఒలంపియాడ్ ఫలితాల్లో నేషనల్ లెవల్స్ స్పెల్ బీ లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించిప్రభంజనం సృష్టించారని షైన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలంపియాడ్ నేషనల్ లెవల్ స్పెల్ బి ఫలితాలలో అభిన్ రాజ్ గ్రేడ్ 7 స్టేట్ ఫస్ట్ ర్యాంకు,ఎస్.ఆర్.ఎం.ఓ.లో సుమిత్ గ్రేడ్ 10 స్టేట్ 3వ ర్యాంకు,సీవీ ఆర్.ఎస్.ఓ లో వర్షిత్ గ్రేడ్ 7 స్టేట్ 6 ర్యాంకు, ఎన్. ఎస్.ఓ.లో ఎండి. సానియా గ్రేడ్ 8 స్టేట్ 8 వ ర్యాంకు, ఎన్. ఆర్.ఎం. ఓ.లో ఎండి.జియా ఆఫ్రోజ్ గ్రేడ్ 10 ఆల్ ఇండియా 761వ ర్యాంకు, ఎస్. ఆర్.ఎం.ఓ లో రిషి కౌశిక్ గ్రేడ్ 7 డిస్ట్రిక్ 1ఫస్ట్ ర్యాంకు, సిపిఓ లో శ్రేష్ఠ ఆరాధ్య గ్రేడ్ 8 డిస్ట్రిక్ 1 ఫస్ట్ ర్యాంకు సాధించి ప్రభంజనం సృష్టించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్ మాట్లాడుతూ వివిధ ప్రతిభా పోటీల్లో జాతీయ, రాష్ట్ర,జిల్లా స్థాయి ర్యాంకులు సాధించడం కేవలం ఒక్క షైన్ విద్యార్థులకు మాత్రమే సాధ్యమన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు



