హెల్మెట్స్ ధరించి బైక్ ర్యాలీ
విశ్వంభర, ఇనుగుర్తి: మీరు ఇంటి నుంచి ఎంత సురక్షితంగా ప్రయాణం కోసం వెళ్తారో అంతే సురక్షితంగా మళ్లీ మీ ఇంటికి తిరిగి రావాలని మీ భద్రత మా ప్రధమ లక్ష్యం అని ఎస్సై కరుణాకర్ అన్నారు. స్పందించిన గౌడన్న మేడగోని శ్రీను వెంటనే హెల్మెట్ ధరించి తాటి చెట్లు ఎక్కడానికి వెళ్ళాడు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో ఏప్రిల్ 2 నుంచి వాహనదారులు హెల్మెట్ ధరించే కార్యక్రమానికి ఎస్సై ఆధ్వర్యంలో గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బైక్ లు ఉన్నవారు హెల్మెట్స్ ఖరీదు చేశారు. అనంతరం హెల్మెట్స్ ధరించిన వారితో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులందరూ విధిగా హెల్మెట్ ధరించాల్సిందేనని ఎవరికి మినహాయింపు లేదన్నారు.బైక్ డ్రైవ్ చేసే సమయంలో వేగం కన్నా ప్రాణం ముఖ్యమని గుర్తుంచుకోవాలన్నారు. కార్ల లో ప్రయాణం చేసేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు.గ్రామంలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు ఎవరైనా విక్రయించిన వాడిన సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య, ఉప సర్పంచ్ తుమ్మనపల్లి సతీష్, కాంగ్రెస్ జిల్లా నేత బైరు అశోక్ గౌడ్,శ్రీనివాస్,సందీప్ వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.



