ఘనంగా హనుమాన్  శోభాయాత్ర

ఘనంగా హనుమాన్  శోభాయాత్ర

విశ్వంభర, జిహెచ్ఎంసి: శ్రీ హనుమజ్జయంతి పర్వదినం  పురస్కరించుకొని శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములో ఉదయం 4.30 లకు  నుండే భక్తులు శ్రీ స్వామి వారి దర్శనార్థము పోటెత్తారు.  ఉ.5.00 గం.లకు ప్రత్యేక సింధూర అభిషేకము అనంతరము సాధారణ భక్తులకు దర్శనాలు కల్పించగా వేలాది మంది సుమారు లక్షకి పైగా భక్తులు జై శ్రీ రాం నినాదాలు చేస్తూ శ్రీ స్వామి వారిని దర్సించుకొన్నారు.  భక్తుల రద్దీని ముందుగనే అంచనా వేసి ఆలయ కార్యనిర్వహణాధికారి, చైర్మన్ మరియు ధర్మకర్తలు నిర్దిష్ట ప్రణాలిక ప్రకారముగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ప్రత్యేక దర్శనములకు సాధారణ దర్శనములకు వేరు వేరుగా ప్రవేశ మార్గాలను, క్యూ లైన్లను ఏర్పాటు చేసి క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట లేకుండా అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేసినారు. ప్రధాన అలయములో ప్రత్యేక ఏ.సి.లను ఏర్పాటు చేసి భక్తులు ఉక్కపోతకు గురి కాకుండా చూడటం జరిగింది. ఉచిత తీర్థ ప్రసాదములతో పాటు భక్తులకు వేసవి తాపం నుండి ఉపశమనం కొరకు చల్లని మజ్జిగ, పండ్లు, మంచినీరు పంపిణీ చేశారు.  ప్రధాన ఆలయముతో పాటుగా ఆలయమంతా పూల అలంకరణతో శోభాయమానంగా అలంకరించగా దేవస్థానము ద్వారా చేసిన ఏర్పాట్లపై భక్తులు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు.ఉదయం 8.00 గం.లకు సామూహిక శ్రీ చండీ సహిత మన్యుసూక్త హోమము నిర్వహించగా సాయంత్రం 6.00 గం.లకు శ్రీ స్వామి రథోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయబడినవి. భక్తుల ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి యన్. లావణ్య, చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలు దిండు ప్రవీన్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, సింగంశెట్టి శ్రీనివాస్, జనుంపల్లి విష్ణువర్ధన్ రెద్ది, నారాయణ్ దుర్గా రెడ్డి, కుకునూరి గోపాల్ రెడ్డి, పూల నాగరాజు, కె. కవిత, ఓరుగంటి నరేష్, కొండ్ర సంతొష్ కుమార్, బండిగారి శ్రీనివాస్ గౌడ్, ఎనుముల రవీందర్ రెడ్డి, శ్రెమతి యం. రాజేశ్వరి ఎప్పటికప్పు సమీక్షిస్తూ ఆలయ అర్చక సిబ్బందికి తగు సూచనలు జారీ చేస్తూ భక్తులు ప్రశాంతంగా శ్రీ స్వామి వారిని దర్శించుకునేల చూశారు.

Tags: