అధికారులు బాధ్యతతో పనిచేయాలి
: ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: ప్రభుత్వ అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజా ప్రభుత్వానికి మంచిపేరు తీసుకు వచ్చి , ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక విద్యానగర్ లోని రామలింగేశ్వర ఆలయం వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అధ్యక్షతన జరిగిన వార్డు సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేయడానికి ప్రజా పాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసే వారు మరింత మెరుగ్గా పనిచేయాలని అన్నారు. కొత్తగా ఇల్లు కట్టుకునే వారు మున్సిపాలిటీకి సమర్పించిన ప్లాన్ ప్రకారమే ఇల్లు కట్టుకునే విదంగా టౌన్ ప్లానింగ్ అదికారులు పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. వార్డు ఆఫిసర్లకు భాద్యతలను అప్పగించాలని, నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్లాన్ లో లేని విదంగా మూడు, నాలుగు అంతస్తులు నిర్మాణం చేసిన తరువాత నోటిసు లు ఇవ్వడం సరైన పద్దతి కాదని తెలిపారు. నిర్మాణం చేయక ముందే గృహ యజమానికి తెలియజేయాలని అన్నారు. మున్సిపాలిటీ ఆదాయం పెంచుకోవాలని, ప్రాపర్టి టాక్స్ లను వసూలు చేయాలని, మున్సిపాలిటీ లో ఖాళిగా వున్న దుకాణాలకు వేలం పాట పెట్టి కిరాయికి ఇవ్వాలని చెప్పారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ సిడిఎంఎ సెక్రటరీ ని ఇటీవల కలిసి సూర్యాపేట మున్సిపాలిటీ లో చేయవలసిన అభివృద్ది పనుల పై చర్చించానని తెలిపారు. సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్దికి కావలసిన నిధుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి , తాను కలిసి మాట్లాడుతామని అన్నారు. సూర్యాపేట పట్టణం అభివృద్ధి లో వెనకబడి ఉందని అన్నారు. పట్టణంలోని 60ఫీట్ల రోడ్ లో అనేక విద్యాసంస్థలు వున్నాయని, ఆ రోడ్ లో ఆకతాయులు తిరగకుండా పోలీసు విభాగం వారు తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. ఉదయం సాయంత్రం పోలీసు వాహనం వుంచి ఆకతాయులు, మద్యం సేవించిన జులాయిలు తిరగకుండా పోలీసు లు తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో స్ధానికులు మాట్లాడుతూ పట్టణంలో దోమలు ఎక్కువగా వున్నాయని, దోమల నివారణ కు చర్యలు చేపట్టాలని అన్నారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ తవ్వకాలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని కాంట్రాక్టర్ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ, అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రయినేజి తవ్వకాలను కేంద్ర ప్రభుత్వ పధకం ద్వారా పనులు చేయడం వలన మున్సిపాలిటీ కి పర్యవేక్షణ అదికారం లేదని పేర్కొన్నారు. అయిన కాంట్రాక్టర్ ను పిలిపించి పట్టణ ప్రజలకు ముందుగానే తెలియజేసి , పట్టణంలో పర్యటించి, సమస్య తీవ్రంగా వున్న చోట రోడ్లను రిపేర్ చేయించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వుండే విదంగా చర్యలు చేపట్టాలని అన్నారు. దోమల నివారణ కు అదనంగా దోమలమందు కొట్టే మిషన్ లను కొనుగోలు చేయాలని కమీషనర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షఫి వుల్లా, మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి, పట్టణ సిఐ వెంకట్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్,ఇ. ఇ కిరణ్,శానిటరి ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్,కౌన్సిలర్ లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, గుణగంటి హేమ సతీష్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.



