ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ
విశ్వంభర, నాగారం: రైస్ స్వచ్ఛంద ఆధ్వర్యంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నాగారం మండల కేంద్రం, సూర్యాపేట జిల్లా లో మూడు నెలలుగా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టి శిక్షణ తీసుకున్న 30 మహిళలందరికీ ఉచిత కుట్టు మిషన్లు , శిక్షణ పత్రాలు అందజేసి. ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ ప్రతి మహిళ తను నేర్చుకున్న శిక్షణతో, ఉపాధి పెంచుకుంటూ మహిళ ఆర్థిక స్వావలంబన సాధించాలని, ప్రతి మహిళ తన కాళ్లమీద తాను నిలబడాలని, విలువలతో కూడిన విద్య నేర్చుకోవాలని శిక్షణ నేర్చుకోవాలని , మహిళలందరూ స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా నిలబడాలని, కుట్టు శిక్షణ లో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని మరింత అభివృద్ధి మా ఈ రైస్ సంస్థను 2009 లో ప్రారంభించి గ్రామీణ ప్రాంతాలలో ,పేద ప్రజలు నివసిస్తున్న అటువంటి పట్టణాలలో విద్య, జీవనోపాది, వ్యవసాయం మరియు వైద్యం , వికలాంగుల ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, 730 మందికి కుట్టు మిషన్లు అందజేశామని అని అన్నారు. రైస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఫౌండర్ మొగుళ్ళ అమరేందర్ గౌడ్ , కోశాధికారి నరేష్ కుమార్ రెడ్డి , ,సంస్థ కోఆర్డినేటర్ రమేష్ కుట్టుమిషన్ మిషన్ శిక్షకురాలు శ్రీమతి శోభ యలమకంటి సోమన్న శ్వేత, పవన్, వెంకటేష్ , తదితరులు పాల్గొన్నారు.



