సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి

సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి

విశ్వంభర, మోహినాబాద్:-మోహినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్‌లోని చైతన్య డీమ్డ్-టు-బి విశ్వవిద్యాలయంలో గురువారం “సాంప్రదాయ దినోత్సవం”ను విద్యార్థులు ఉత్సాహంగా, సాంస్కృతిక వైభవంతో ఘనంగా నిర్వహించారు. భారతదేశంలోని విభిన్న ప్రాంతాల సంస్కృతులను ప్రతిబింబించేలా విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో క్యాంపస్‌కు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో విశ్వవిద్యాలయ ప్రాంగణం కళకళలాడింది.ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, నృత్య ప్రదర్శనలు భారతీయ సంప్రదాయ గొప్పతనాన్ని ప్రతిఫలించాయి. విద్యార్థుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి హాజరైన విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ డా. సి.హెచ్. పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, సాంప్రదాయ వేడుకలు విద్యార్థుల్లో తమ మూలాల పట్ల గౌరవాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు.డైరెక్టర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డా. సి.హెచ్. సాత్విక రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక కాలంలో సాంప్రదాయ విలువలను కాపాడుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.
ఈ వేడుకల్లో వైస్ ఛాన్సలర్ ఆచార్య జి. శంకర్ లింగం, రిజిస్ట్రార్ ఆచార్య ఎం. రవీందర్, డీన్స్ ఎ. రాజు, ఎస్. కవిత, సి.హెచ్. ప్రత్యుష రెడ్డి, పి. సుగంధ దేవి, క్రిస్టోఫర్, ఎం. జగదీశ్వర్, జి. కుమారస్వామి, సి.హెచ్. సునీత, డి. దేవ్ కుమార్, విభాగాధిపతులు, సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థినులు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ & పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారూ

Tags:  

Advertisement

LatestNews

సాంప్రదాయ దినోత్సవం ఘనంగా.. చైతన్య విశ్వవిద్యాలయంలో సంస్కృతి సందడి
ఒలింపియాడ్ ఫలితాల్లో ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్ షైన్ విద్యార్థుల ప్రభంజనం.. సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
అంగరంగ వైభవంగా క్రీస్తుజ్యోతి ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు..పాస్టర్ రెవరండ్ గోపు జయప్రకాష్ వెల్లడి
విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది. 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు
రూ. 4.70 లక్షల విలువైన  గుట్కా పట్టివేత
మద్యపానంపై కట్టడి, టవర్ ఏర్పాటుకు హామీ