కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
On
విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారంనాడొక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతుల పక్షాన అసెంబ్లీలో కొట్లాడితే ప్రభుత్వం దిగొచ్చి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని చెప్పారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్ కుడాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



