హనుమాన్ శోభాయాత్ర లో పాల్గొన్న కూన శ్రీనివాస్ గౌడ్ 

హనుమాన్ శోభాయాత్ర లో పాల్గొన్న కూన శ్రీనివాస్ గౌడ్ 

విశ్వంభర, కుత్బుల్లాపూర్:  హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట హనుమాన్ టెంపుల్ వద్దనుండి నిర్వహించిన శోభాయాత్రలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ హాజరై భక్తులతో కలిసి పాదయాత్రలో ఆ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ హనుమంతుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా గాజులరామారం లో హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక హనుమాన్ ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరై ఆ ఆంజనేయస్వామి పూజలో పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి  స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Tags: