బడుగుల కోసం పోరాడిన మహానీయుడు పాపన్న గౌడ్ : విహెచ్ 

బడుగుల కోసం పోరాడిన మహానీయుడు పాపన్న గౌడ్ : విహెచ్ 

విశ్వంభర, విద్యానగర్ : భూస్వాముల, పెత్తందారుల అన్యాయాలకు వ్యతిరేకంగా బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం స్వరం వినిపించిన మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. అంబర్‌పేట గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “మేమూ మనుషులమే” అనే ఆత్మగౌరవ భావనతో ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడిగా పాపన్న గౌడ్ నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో రవి గౌడ్, పంజాల గిరిధర్ గౌడ్, తొలుపునూరి కృష్ణ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, శ్రీహరి గౌడ్, సతీష్ గౌడ్, రమణ గౌడ్, వెంకట్ గౌడ్, రోహిత్ నంద రాజ్ గౌడ్, ప్రదీప్ గౌడ్, పంజాల జ్ఞానేశ్వర్ గౌడ్, నారాయణస్వామి, లక్ష్మణ్ యాదవ్, సత్తి బాబు గౌడ్, శ్రీధర్ గౌడ్ తదితరులు.

Tags: