మధ్యాహ్న భోజన ప్రక్రియ పరిశీలన
On
విశ్వంభర, సిద్దిపేట: అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీలోని మధ్యాహ్న భోజన పక్రియను కలెక్టర్ హైమావతి గురువారం తనిఖీచేశారు. అన్నం, పప్పు, బెండకాయ, రసం, పెరుగును పరిశీలించారు. కూరల నాణ్యత మెరుగుపర్చాలని, కూరలు విద్యార్థులకు సరిపోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు ప్రకారం సరిపడేంత, రుచికరంగా వండాలని సూచించారు. ఇష్టానుసారంగా వండితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కూర సరిపడేంత వండలేదని హాస్టల్ వార్డెన్‌పై యాక్షన్ తీసుకోవాలని డీసీవోను ఫోన్‌లో ఆదేశించారు. విద్యార్థులకు భోజనం, వసతి, చదువు విషయంలో రాజీ పడొద్దని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. ఉపాధ్యాయులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.



