సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి
On
విశ్వంభర, మహబూబాబాద్: గురువారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, హాజరై శ్రీ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సమావేశంలో బిసి వెల్ఫేర్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, జిల్లా క్రీడల అధికారిని జ్యోతి ఓలేటి, వెంకటేశ్వర్లు, రవీందర్, కలెక్టరేట్ లో నీ వివిధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



