గ్రామసభకు హాజరైన మండల అధికారులు
On
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలందర్ రెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలందర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు, గత 2 సంవత్సరాలుగా లబ్ది పొందిన పథకాల గురించి వివరించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఈ పథకాల లబ్ధిని పొందే విధంగా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి దశరథ నాయక్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యుగందర్ , ఏపీఓ పరశురాములు ,హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ సిబ్బంది, సర్పంచ్ కుంభం వెంకటపాపిరెడ్డి వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.



