విలాసారం సంధ్యారాణి కి పితృవియోగం.-సంధ్యారాణి కుటుంబానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుంది.
చైర్మన్ మహమ్మద్ మోయునుద్దిన్ వెల్లడి.
విశ్వంభర, వరంగల్:- ఇంటర్నేషనల్ హ్యూమన్ చిల్డ్రన్ అండ్వు మెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షురాలుఅయిన విలాసారం సంధ్యారాణి తండ్రి పోశాల వీరస్వామి శుక్రవారం రోజున పరమపదించినారు. దీనికి శ్రద్ధాంజలి ఘటించడానికి నేషనల్ చైర్మన్ మహమ్మద్ మొయినుద్దీన్ జాతీయ కోశాధికారి వి.త్రివిక్రమ్ గౌడ్ , తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుమ్మరి సంపత్ తెలంగాణరాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు బుర్ర కళ్యాణి హనుమకొండ జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు అమరావతి భూపాల్ పల్లి జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సరిత తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం చైర్మన్ మహమ్మద్ మోహినిద్దీన్ మాట్లాడుతూ. సంధ్యారాణి కుటుంబ సభ్యులకు దేవుడు వారికి ధైర్యాన్ని శాంతిని సమాధానాన్ని ఇవ్వాలని అన్నారు వారికి ఎల్లవేళలా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ వారు వారి కుటుంబానికి అండగా నిలబడుతుందని అన్నారు. పోశాల వీరస్వామి 30 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ తోటి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులతో మన్ననలు పొందారు. ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు వారు చివరగా ప్రధానోపాధ్యాయులుగా పదవి విరమణ చేశారు. అని తెలిపారు. కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



