రూ. 4.70 లక్షల విలువైన  గుట్కా పట్టివేత

రూ. 4.70 లక్షల విలువైన  గుట్కా పట్టివేత

 విశ్వంభర, హనుమకొండ:  హనంకొండ టైలర్ స్ట్రీట్ లోని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర శివం కిరాణా స్టోర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత పొగాకు ఉత్పత్తులను పట్టుకున్నట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు.  నిందితుడు రాజ్ పుత్ చేతన్ నిషేధిత పొగాకు ఉత్పత్తులను ఇతర ప్రాంతాల నుండి తెప్పించి ఇక్కడ పలు షాపుల వారికి అమ్ముతున్నట్టు విచారణలో వెల్లడైందని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. సమాచారం మేరకు హన్మకొండ ఎస్సై కిషోర్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది మహిపాల్, తిరువర్ధన్  కిరాణా షాప్ పై రైడ్ చెసి గుట్కాలు స్వాధీనపరుచుకున్నట్టు తెలిపారు.

Tags: