కౌకుంట్లలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలు

కౌకుంట్లలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలు

 విశ్వంభర, కౌకుంట్ల :  మహబూబ్నగర్ జిల్లాలోని కౌకుంట్ల మండలం లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలులో భాగంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి గ్రామసభను మొదలు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు  జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్స్, గృహ జ్యోతి, రోడ్డు లేని ప్రాంతాలకు రోడ్డు విస్తరణ పనులు, నూతన విద్యుత్ స్తంభాలు వేయడం, శానిటేషన్ పై జాగ్రత్త వహించడం, కళ్యాణ లక్ష్మి ల గురించి చర్చ చేయడం, బాలింతలు గర్భిణీలు ఎప్పటికప్పుడు ప్రణాళిక బద్ధంగా శ్రద్ధ ఆశ వర్కర్లు  చూపడం, మహిళా సంఘాల లోటుపాటులు  తెలుసుకోవడం, ప్రజలకు ఆపద సమయాలలో అందిస్తున్న ఆర్థిక సాయం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా అందించడం జరిగింది. అలాగే గ్రామానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవడం, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 100 రోజుల పని దినాల గురించి చర్చ చేయడం ప్రజల అడిగిన ప్రతి ప్రశ్నకు సానుకూల స్పందనలతో చర్చ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల రెవెన్యూ ఆఫీసర్ సుందర్ రాజు అధ్యక్షత వహించగా, గ్రామ సర్పంచ్ నరేష్, ఉప సర్పంచ్ లక్ష్మీకాంతరావు, మాజీ సర్పంచ్ కిషన్ రావు, పంచాయతీ , విద్యుత్ శాఖ AE, ఆరోగ్యశాఖరఘువరన్, జిపిఓ శివకుమార్, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, మహిళలు, ఆశా వర్కర్లు, మహిళా సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags: