ప్రజా సంఘాల శాంతి ర్యాలీ కరపత్ర ఆవిష్కరణ
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలో అన్ని రాజకీయ, కుల, ప్రజా సామాజికవేత్తలు అందరూ కలిసి పట్టణంలో ఇజ్రాయిల్ అమెరికా కలసి ఇరాన్ పై జరుపుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపి శాంతి చర్చలు కొనసాగించాలనే డిమాండ్తో ఈ నెల నాలుగున పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బీసం రామయ్య, డాక్టర్ జాడి రాజు, కస్తూరి ప్రభాకర్ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య లు తెలిపారు. గురువారం స్థానిక మిర్యాలగూడలోని అమరవీరుల స్థూపం వద్ద వివిధ ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు సామాజికవేత్తలతో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. యుద్ధం ద్వారా ఆ మూడు దేశాలే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం అనేక సమస్యలతో అల్లాడుతుందని ఇలాగే యుద్ధం కొనసాగితే బడుగు బలహీన వర్గాల దేశాలు ప్రజలు అనేక సమస్యల వలలో చిక్కుకోవడం జరుగుతుందని అన్నారు. ఈనెల 4న మిర్యాలగూడలో జరిగే శాంతి లారీలో ప్రజాస్వామ్యవాదులు విద్యావంతులు మేధావులు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సామాజిక నాయకురాలు ఉదయ కిరణ్మయి,దశరధ నాయక్, రవి నాయక్ ధర్మ సమాజ పార్టీ ఎల్లయ్య జన విజ్ఞానం యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్,రావు, హరికృష్ణ, బిఆర్ఎస్ నాయకులు సోయబ్, నాగేశ్వరరావు, మురళి,యాదవ్, ముస్లిం మైనార్టీ సంఘాలు వివిధ ప్రజాసంఘాలు తదితరులు పాల్గొన్నారు.



