పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం గ్రామం పర్వతగిరి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ డే ఘనంగా జరిగింది . పాఠశాల ప్రధానోపాధ్యాయులు మందుల శ్రీరాములు అధ్యక్షతన వహిoచారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ చల్ల అనిత వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులను , ఉద్దేశించి సర్పంచ్ చల్ల అనిత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా కష్టపడి , ఇష్టపడి, చదివినప్పుడే ఉన్నత శిఖరాలకు ఎదుగుతామని విద్యార్థులకు పిలుపునిచ్చారు . ఇప్పటికి కూడా ఎవరైనా బార్డర్ లైన్ లో ఉన్న విద్యార్థులు ఉంటే వారి పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి పరీక్షలకు సన్నద్ధులు చేయాలని , ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్ష టైం టేబుల్ పరీక్షకు మూడు, నాలుగు, రోజుల విరామం ఒక పరీక్ష అయిన తర్వాత విరామ రోజులలో కూడా పాఠశాలలో వచ్చి ఉపాధ్యాయుల సలహాలు ,సూచనలు, పాటించాలని అన్నారు . అనంతరం విద్యార్థులకు పరీక్ష సామాగ్రి దాత అయిన సోమ పురుషోత్తం , దంపతులు మరియు పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్ దాత అయిన నారాయణ సింగ్ , పరీక్షల సామాగ్రి అయిన ప్యాడ్స్ పెన్నులు పెన్సిల్లు కంపాస్ బాక్స్ తదితర వస్తువులను విద్యార్థులు అందజేశారు . ఈ కార్యక్రమంలో వివో ఏ సుధాకర్. పాఠశాల ఇంచార్జ్ వ్యవహరిస్తున్న ఎన్ రవి. రవికుమార్. ఉమారాణి. కృష్ణ ప్రభాకర్ రాములు ప్రేమ కుమార్. శ్రీనివాస్. శ్రీలత. ఉపాధ్యాయులు , విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు .



