పేదలకు తక్షణమే ఇండ్ల పట్టాలు ఇవ్వాలి

పేదలకు తక్షణమే ఇండ్ల పట్టాలు ఇవ్వాలి

  •  కలెక్టరేట్ ముందు  ధర్నా 

విశ్వంభర, మహబూబాబాద్: 58 జీవోలో   నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు అప్లై చేసి సర్వే చేసిన పేదల ఇండ్లకు  తక్షణమే పట్టాలు  ఇవ్వాలని ,  ఇంటి నెంబర్లు, ఇవ్వాలని కాలనీలలో కరెంటు, సైడ్ డ్రైనేజీ, రోడ్లు మంచినీటి సౌకర్యం కల్పించాలని కాలనీలలో అంగన్వాడి, కేంద్రాలను ప్రైమరీ స్కూల్ లను ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కురవి గేట్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు . అనంతరం పలు డిమాండ్లతో కూడిన  కలెక్టర్ కు  వినతిపత్రం అందజేశారు, ఈ కార్యక్రమముకు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు  హలవత్ లింగన్న అధ్యక్షతన వహించారు.ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  మండల వెంకన్న మాట్లాడుతూ , పట్టణంలో కూలి పనులు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలు గత 15 సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తుండగా 58 జీవో ప్రకారంగా అనేక దపాలుగా కాలేళ్ల పేదల ఇండ్ల స్థలాలను, సర్వేలు చేశారు .కొంతమందికి ఎన్నికల ముందు పట్టాలు ఇవ్వగా మరి కొంతమందికి పట్టాలు ఇవ్వలేదు,  అనంతరం   పట్టాలు లేకపోవడం, వలన ఇంటి నెంబర్లు, కేటాయించకపోవడంతో పేదల ఇండ్లకు, రావలసిన కరెంటు సౌకర్యం లేక మంచినీటి సౌకర్యం లేక రోడ్డు డ్రైనేజీ లేక తీవ్ర సతమత మవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పేదలు వేసుకున్న సామ పూలక్క నగర్ , దొరన్న నగర్, బట్టు అంజయ్య నగర్, ప్రగతి నగర్ , మాధవన్న నగర్ , పైలవాసు దేవరావు నగర్ కాలనీలలో,  సర్వే నిర్వహించిన పేదల ఇండ్లకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని గత  ప్రభుత్వంలో  అనేకసార్లు అధికారులకు విన్న వించిన స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు .  ఇప్పటికైనా సర్వే చేసిన ఇండ్లకు తక్షణమే పట్టాలిచ్చి పేదలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు . 
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు సామ పాపయ్య, పర్వత కోటేష్, మండల నాయకులు కుక్క మూడి యాకయ్య ,  గుండెల కృష్ణ ,  కుక్కమూడి అనిత ,శివారపు శారద ,అలీ యాకాంబరం, మునిత,  కల్పన ,కందుకూరి శ్రీనివాస్,ధర్మారపు ముత్తయ్య , జ్యోతి, సునిత,  సుజాత  ,షాబుద్దీన్ ,తదితరులు పాల్గొన్నారు .

Tags: