అర్చకుల వేతనాలు వెంటనే చెల్లించాలి

అర్చకుల వేతనాలు వెంటనే చెల్లించాలి

విశ్వంభర,ఇనుగుర్తి: ఆలయాలలో ధూప దీప నైవేద్య అర్చకులకు వేతనాలు వెంటనే చెల్లించాలని అర్చక సమాఖ్య జిల్లా గౌరవ అధ్యక్షులు,ఇనుగుర్తి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు తిరునహరి కృష్ణమాచార్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఆయన బుధవారం ఇక్కడ మాట్లాడుతూ ప్రభుత్వం అర్చకులకు నెలనెలా చెల్లించే రూ.10 వేలలో రూ.4 వేలు ధూప దీప నైవేద్యాల ఖర్చుకు కాగా, కేవలం రూ. 6 వేలు అర్చకులకు వేతనం కింద ప్రభుత్వం ఇస్తోందన్నారు. ఇవి కూడా గత మూడు నెలలుగా చెల్లించకపోవడంతో అర్చక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనంతో కుటుంబ పోషణ చేసుకుంటూ ఆలయాలకు,సమాజానికి సేవ చేస్తున్న అర్చకుల వేతనాలు పెండింగ్ ఉంచవద్దన్నారు. వెంటనే బకాయిలను మంజూరు చేసి కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు పెంచి నెలకు రూ.24 వేల చొప్పున అర్చకులకు నెలనెలా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags: