డ్రైనేజీ విస్తరణ పనులు
On
విశ్వంభర, చంద్రాయణ గుట్ట : చంద్రాయణ గుట్ట నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పది డివిజన్లలో, నాళాలు డ్రైనేజీ విస్తరణ ప్రాజెక్టు పనులను చాంద్రాయణ గుట్ట నియోజకవర్గ ఇన్చార్జ్ బోయ నగేష్ తానాజీ నగర్ లో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోయ నగేష్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రజలు సమస్యలు నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వాటికి పరిష్కారం చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో అంజమ్మ, అంజయ్య,భరత్, అనిల్, సుధాకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్థానిక బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



