ప్రజలను దోచుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థలు
On
విశ్వంభర, అనంతపురం: శ్రీ చైతన్య విద్యాసంస్థలు ప్రజలను మభ్యపెట్టి కోట్ల సంపాదిస్తున్నారంటూ జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షుడు కొడవండ్ల నరేష్ పేర్కొన్నారు. అనంతపురం అర్బన్ లోని శ్రీ చైతన్య విద్యాసంస్థలు సిబిఎస్ సిలబస్ పర్మిషన్ లేకున్నా సిబిఎస్ సిలబస్ ఉందంటూ ప్రజల నుండి డబ్బులు దండుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులను పట్టిపీడిస్తున్నారని అంతేకాకుండా రికమండేషన్ ఉంటే ఫీజులు తగ్గిస్తూ రికమండేషన్ లేని వాళ్లకు ఫీజుల రూపంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయని అన్నారు. కార్పొరేట్ కళాశాలలో చదువుకోవాలంటే లక్షలు కావాలనే అపూహలో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఈ విషయంపై విద్యార్థుల ఫీజులపై జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని అన్నారు.



